
నయనతార (Nayanathara), విఘ్నేష్‌ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నయనతార తన పెళ్లి వేడుక ఫోటోలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మొదట తాళి కట్టిన తర్వాత విఘ్నేష్ తన నుదిటిపై ముద్దు పెట్టుకునే ఫోటోను షేర్ చేశారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు తాళి కట్టే ఫోటోను షేర్ చేశారు.
విఘ్నేష్ కూడా తన ట్విట్టర్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు. నయనతార (Nayanathara)తో ప్రేమ బంధం. పెళ్లిగా మారిందంటూ పోస్ట్ చేశారు. 'ఇద్దరం పెళ్లి బంధంతో ఒకటయ్యాం' అని తన అభిమానులకు తెలిపారు.
ఏడేళ్ల ప్రేమను పెళ్లితో నూరేళ్ల బంధంగా మార్చుకున్నామంటూ సంతోషం వ్యక్తం చేశారు.
Follow Us