ENTERTAINMENT
తండ్రీ, కొడుకుల అనుబంధం : టాలీవుడ్ స్టార్ నాని చిత్రమాలిక
Babu Koilada
JUNE 08, 2022
Image: Nani Instagram
జున్నుగాడితో దోబూచులాట
నాని గారాల బిడ్డ పేరు అర్జున్. జున్నుగాడని తనను నాని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు. షూటింగ్ పూర్తయి ఇంటికి వచ్చాక, ఎక్కువగా తన బిడ్డతోనే గడుపుతూ ఉంటాడు
Image: Nani Instagram
నా కొడుకే నా హీరో
నాని తన కొడుకుతో గడిపే ప్రతీ అరుదైన క్షణాన్ని ఫోటో ఫ్రేములో బంధిస్తుంటాడు. తనతో ఆటలాడుతూ, ముచ్చట్లాడుతూ.. ఆ భావోద్వేగ క్షణాలలో తనను తానే మైమరిచిపోతుంటాడు
Image: Nani Instagram
చిరునవ్వుల బుజ్జాయితో.. సందడే సందడి
ఇంట్లో పిల్లలుంటే ఆ సందడే వేరు కదా. నాని కూడా అంతే. ఎంత పెద్ద సినీ స్టార్ అయినప్పటికీ కూడా, తన చిన్నారికి కేటాయించాల్సిన సమయాన్ని తప్పకుండా కేటాయిస్తాడు. ఆ ప్రేమను ఆస్వాదిస్తూ, తనను తానే మైమరచిపోతుంటాడు
Image: Nani Instagram
ప్రతి రోజూ పండగే..!
పండగ వేళప్పుడు, ఇంట్లో చిన్నారులుంటే.. వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రతి రోజూ కొంత సేపు గడిపితే, అది వారికి 'ప్రతి రోజు పండగ' మాదిరిగానే ఉంటుంది
Image: Nani Instagram
నాన్న.. ఈ మాటకి అర్థాలను వెతకలేం. తండ్రి కొడుక్కి ఎప్పుడూ ఓ మంచి స్నేహితుడే. పిల్లల్ని పెద్దలు ఎప్పుడూ మంచి స్నేహితులగానే ట్రీట్ చేయాలి. అప్పుడే వారి సున్నితమైన మనసులోని భావాలను అర్థం చేసుకోగలం
చిట్టి పొట్టి నవ్వుల చిన్నా.. నీ కోసమే నేనున్నా !
Image: Nani Instagram
ఇప్పుడు పిల్లలకు జోలపాటలు పాడి నిద్దురపుచ్చే రోజులు కావు. వారికి కథలైనా చెప్పాలి. కబుర్లైనా చెప్పాలి. ఎంతైనా మోడరన్ తరం కదా !
జోలాలీ జోలాలీ.. !
Image: Nani Instagram
ఫోటోలు తీయడం ఒక కళ. అలాగే ఫోటోలను సరికొత్తగా తీయించుకోవడం కూడా ఓ కళే. ముఖ్యంగా తండ్రీ, కొడుకులు తమ ముచ్చట్లన్నీ కెమెరాలో బంధించేస్తే, అవి ఎప్పటికీ తీపి జ్ఞాపకాలగానే మిగిలిపోతాయి
చిన్నారితో.. స్పెషల్ ఫోటో షూట్ !
Image: Nani Instagram
పసిపిల్లల నవ్వు చాలా స్వచ్ఛమైనది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలుంటాయి. కల్మషం లేని ఆ నవ్వు.. ఓ తియ్యటి బాంధవ్యానికి మచ్చుతునక
ఆ నవ్వుకి అర్థాలెన్నో !
Image: Nani Instagram
పసి మనసులు ఎప్పుడూ లేత మనసులే. వారిని నొప్పించకుండా, ఆప్యాయతను పంచినప్పుడే కదా.. తల్లిదండ్రుల జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఉంటుంది
లేత మనసుల గూటిలో ..!
Image: Nani Instagram
ప్రతీ పుట్టినరోజు, బుజ్జాయిలకు ఓ మధురానుభూతే. అందుకే పుట్టినరోజు నాడు వారిని నొప్పించకుండా, పెద్దలు వారిలో సంతోషాన్ని నింపేందుకు ప్రయత్నించాలి. అదే వారికి కొండంత బలం
అందమైన మనసు.. అందమైన జ్ఞాపకం
THANKS FOR READING
NEXT: Alia Bhatt's tracksuit collection
Click Here